6:18 AM

గుజరాత్ మోఢేరా సూర్య దేవాలయం

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోఢేరా సూర్య దేవాలయానికి తీసుకువెళుతున్నాం. అహ్మదాబాద్‌నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్ సోలంకి-I నిర్మించారు. క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ' అహిల్‌వాడ్ పాటణ్ ' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది.
తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు.
కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు.
ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో మూడు సూర్యదేవుని ఆలయాలున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండవది జమ్మూలోనున్న మార్తాండ్ ఆలయం మరియు మూడవది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య మందిరం

శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశేషం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్‌దేవ్ నిర్మించారు. ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. మందిర గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది.మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను చెక్కారు మరియు రామాయణం, మహాభారతంలోని ప్రధానమైన విషయాలనుకూడా చెక్కారు. స్థంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారంలోను అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి.
సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. సభామండపానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.
చరిత్రలో మోఢేరా మందిరం...
స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాలననుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను 'ధర్మరన్య' అని పిలిచేవారు. శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపంనుంచి బయట పడేందుకు తగిన పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడిని అడిగాడని పురాణాలు చెపుతున్నాయి. అప్పుడు గురువైన వశిష్ట మహర్షి ' ధర్మరన్య' వెళ్ళమని శ్రీరామ చంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ క్షేత్రమే ఇప్పుడు మోఢేరా పేరుతో పిలవబడుతోంది.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం : మోఢేరా సూర్యదేవుని ఆలయం అహ్మదాబాద్‌నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్‌నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది. రైలు మార్గం : అహ్మదాబాద్ వరకు రైలు మార్గంగుండా ప్రయాణించి ఆ తర్వాత బస్సు లేదా టాక్సీలలో ప్రయాణించాలి. వాయు మార్గం : అహ్మదాబాద్ విమానాశ్రయం.

6:09 AM

ఫెంగ్ ష్యూతో కాలగమనంలో మార్పులు

మానవుని జీవన గమనాన్ని ప్రకృతిలోని వివిధ అంశాలతో మిళితం చేస్తూ భవిష్యత్తును దేదీప్యమానంగా వెలుగు చూపేందుకు రూపోందించిన శాస్త్రమే ఫెంగ్ ష్యూ. మూడువేల సంవత్సరాల కిందట ఈ శాస్త్రం ఫ.సి పేరుతో చైనాలో వెలుగు చూసింది. తదనంతరం ఫెంగ్ ష్యూగా రూపాంతరం చెంది వాస్తు, అలంకరణ, జీవన విధానాలపై పెను మార్పులు తీసుకు వచ్చింది.ఫెంగ్ ష్యూ శాస్త్రం మానవుడి నిత్య జీవితానికి సూచించబడిన అంశాలు చాలావున్నాయి. ఈ శాస్త్రం ప్రకారం జీవితంలోని కీలక అంశాల్లో శక్తిని అంధించగలవని ప్రధానంగా చెపుతుంటారు. అలాగే వాస్తురీత్య ఎనిమిది మూలల్లో ఏ మూల ఎలా శుభం జరుగుతుందో ఇలా వివరించారు.

1. ఆగ్నేయం... సంపద, వృద్ది, చెక్క, ఆకుపచ్చరంగు.
2. దక్షిణం.... పేరు, ప్రతిష్టలు, అగ్ని, ఎరుపు రంగు.
3. నైరుతి... ప్రేమ, సంసారం, భూమి, పసుపు, మట్టి రంగు.
4. తూర్పు... ఆరోగ్యం, కుటుంబం, చెక్క, ఆకుపచ్చ రంగు.
5. పడమర... భావుకత, సంతానం, లోహం, తెలుపు, బూడిదరంగు, మెటాలిక్ రంగు.
6. ఈశాన్యం... జ్ఞానం, విద్య, భూమి, పసుపు, మట్టి రంగు.
7. ఉత్తరం... వృత్తి, నీరు, నీలం, నలుపు రంగు.
8. వాయవ్యం... యానం, పరోపకారం, లోహం, తెలుపు, బూడిద రంగు, మెటాలిక్ రంగు.

6:07 AM

మీ పిల్లలు.. మీ మాట వినడం.. లేదా?

చాలా మంది పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఎలా చెప్పిన వినకుండా ఎదురు తిరుగుతుంటారు. చాలామందికి ఎంతో డబ్బు ఉన్నా పిల్లలను అదుపులోకి తీసుకోలేక ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు. పిల్లలను ఆచరణలో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని ఫెంగ్‌షుయ్‌ అంటోంది. అవి ఏమిటో చూద్దామా...ముందుగా మీ పిల్లలు నిద్రపోయే గది ఎదురుగా మెట్లు, టాయిలెట్ ఉందేమో చూసుకోవాలి. అలాంటి వాటి నుంచి వెలువడే ప్రతికూలశక్తుల ప్రభావం మీ పిల్లల్ని మొండి వారుగా తయారవవడానికి కారణమవుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.కాగా... పిల్లల గది మెట్లకెదురుగా ఉంటే వాటిని మార్చినట్లైతే మంచిఫలితం ఉంటుందని లేదా గదికి ఎదురుగా టాయిలెట్, మెట్లకు మధ్యలో ఒక విండ్‌చైన్ వేలాడగట్టినట్లైతె మీ పిల్లల్లో మార్పులు వస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. మీ పిల్లలను నేల మీద కాకుండా చాప, బెడ్‌మీద పడుకోపెట్టినట్లైతే సరైన చి ప్రవాహ శక్తితో... సంతృప్తికి లోనవుతారని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. మీ అబ్బాయి, అమ్మాయి పడుకునే, చదువుకునే గదిలో ఈశాన్యం వైపున ఒక చిన్న స్ఫటికాన్ని ఉంచినట్లైతే వారికి చదువులో తెలివితేటలు పెరుగుతాయని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

6:05 AM

మనిషి జీవితంలో అదృష్ట వస్తువుల ప్రాధాన్యం

మనిషి పుట్టినపుడే అదృష్టం అనేది మనిషి నుదుటిపై రాయబడి ఉంటుంది. ఈ రాతను తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. అయితే.. అదృష్టమనేది మన వెన్నంటి ఉంటే.. విధిరాతను కొంతమేరకు తప్పించుకోవచ్చని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చేపుతోంది. పంచ పదార్థాల పునరుత్పత్తి చక్రంలాగే పంచ శక్తులు మన జీవిత గమనాన్ని శాసిస్తుంటాయని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. విధిరాత, అదృష్టం, దయాగుణం, విజ్ఞానం, ఫెంగ్‌షుయ్ అనే ఈ ఐదు మనిషిని నడిపించే ప్రకృతి శక్తులుగా పేర్కొనవచ్చు. ఫెంగ్‌షుయ్‌లో పేర్కొన్న కొన్ని అంశాలను మాత్రం కొంత మేరకైనా పాటిస్తే మనం ప్రకృతి శక్తుల సమతుల్య స్థితి ద్వారా అదృష్టాన్ని సొంతం చేసుకుని, అభివృద్ధి పథంలో పయనించగలుగుతాము. ఇందుకోసం మనం నివశించే ఇళ్లు, మన అభివృద్ధికి దోహదపడే ఆఫీసుల్లో ఎంలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలో తెలియజేస్తోంది. ఆ మార్పులతో పాటు కొన్ని అదృష్ట వస్తువులు మీ ఇంట్లో ఉంచుకున్నట్టయితే మీరు మరింత మేలు జరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెపుతోంది.గృహాల్లో, ఆఫీసుల్లో ఉంచుకోదగిన అదృష్ట వస్తువుల్లో లాఫింగ్ బుద్ధ, డ్రాగన్, ఫోనిక్స్, మూడుకాళ్ల కప్ప, విండ్ చిమ్స్, ఫెంగ్‌షుయ్ నాణేలు, ఫక్, లక్, సా దేవతలు వంటి వస్తువులు ఉంచుకున్నట్టయితే.. కొంత మేరకు అదృష్టం మీ వెంటే ఉంచుకున్న వారవుతారని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. చైనా నాణేలను తలుపులకు వేలాడదీస్తే సంపద ఇంట్లోనే ప్రవహిస్తుందని చైనీయుల నమ్మకం. మూడు చైనా నాణేలను ఎర్రటి రిబ్బిన్‌తో కట్టి ఇంటి తలుపుకు వేలాడ దీస్తే మీకు మరెన్నో ధన సంచులు సమకూరుతాయని నమ్మకం.అలాగే.. నవ్వుతూ ఉండే బుద్ధుడి ప్రతిమను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచినట్టయితే మీకు ధన సంపదలు సమకూరుతాయని, వియజం తప్పకుండా ప్రాప్తిస్తుందని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. సంపదలనిచ్చే దేవునిగా ఖ్యాతి గడించిన బుద్ధుడు.. ఆయన ఆశీసుల వల్ల మనకు మరింత అపరిమిత శక్తి సంపదలను సమకూరుస్తాయని నమ్మకం. చైనీయుల అతి పవిత్రమైన జంతువు డ్రాగన్. దీన్నిఇంటిలో ముఖ్యంగా పడక గదిలో ఉంచుకున్నట్టయితే ఉత్సాహంగా ఉంటారని చైనీయుల నమ్మకం.

6:05 AM

కుటుంబ సఖ్యత, పెళ్లి కుదరాలంటే...!

ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం స్పటికాన్ని (క్రిస్టల్) నైరుతి దిశలో ఉంచితే ఆ కుటుంబ సంబంధాలు మెరుగవడంతో పాటు పెళ్ళికాని వారికి వివాహం కుదరడం జరుగుతుంది. అలాగే ఈ స్పటికాలను ఈశాన్య దిశలో వేలాడ దీయడం ద్వారా మీ పిల్లలు అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తారు.ఉదయాన్నే స్పటికాన్ని ఈశాన్య గదిలోని ఈశాన్య మూలలో ఉంచి, ఐదు నిమిషాల పాటు లేత సూర్య కిరణాలు దానిపై పడేట్లు చేయాలి. ఇలా చేసిన తర్వాత క్రిస్టల్‌లోనికి చూస్తూ... మనకు కావాల్సిన కోరికకు సంబంధించిన దృశ్యాన్ని ఊహించుకున్నట్లైతే ఆ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఇలా స్పటికంలోకి చూస్తూ... మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకుంటే కూడా శుభప్రదమని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా... పదే పదే స్పటికం ముందు అనుకున్న దృశ్యాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఆ ఆలోచనల తాలూకు తరంగాలు స్పటికంలోనే ఉండి పోతాయి. తిరిగి అందులోనూ ఆ తరంగాలు కొనసాగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఆ కోరికను జరగాల్సిన కోణంతోనే మనల్ని నిర్దేశిస్తాయని నిపుణుల నమ్మకం. అలా దృశ్యాన్ని నిక్షిప్త పరచిన క్రిస్టల్‌ను నైఋతి దిశలోని గదిలో నైఋతి మూలలోగానీ, బెడ్‌రూంలోని నైఋతి దిశలో గానీ వేలాడదీస్తే... కుటుంబ సఖ్యతను సాధించవచ్చు. అదే విధంగా ఇంట్లో పెళ్ళి కాని వారి గదిలోని నైఋతి దిశలో ఈ స్పటికాన్ని వేలాడదీస్తే త్వరలో వివాహ సంబంధాలు కుదురుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు అంటున్నారు.

6:03 AM

మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే...?

నిజమైన క్రిస్టల్‌తో చేసిన ఏ వస్తువైనా మీ టేబుల్ ఎడమచేతివైపు పెట్టడం ద్వారా మీ కెరీర్‌ని శీఘ్రంగా అభివృద్ధి చేసుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. క్రిస్టల్ చెట్టు, క్రిస్టల్ పేపర్ వెయిట్, క్రిస్టల్ గ్లోబ్‌లను మీ టేబుల్ మీద ఉంచినట్లైతే ఉన్నత పదవులను అలంకరిస్తారని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అదే విధంగా... క్రిస్టల్ గ్లోబును మీ టేబుల్ మీద ఈశాన్యం దిశగా ఉంచి, ప్రతిరోజూ మూడు సార్లు ఆ గ్లోబ్‌ని త్రిప్పినట్లైతే... మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.ఇకపోతే... క్రిస్టల్ గ్లోబుని మీ పిల్లల టేబుల్ మీద ఈశాన్య భాగంలో ఉంచడం ద్వారా... మీ పిల్లల విద్య, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. భూమి నుంచి తీసిన రియల్ క్రిస్టల్ రాయిని వాస్తుదోషం ఉన్నచోట పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాల్ని పొందవచ్చు. హృదయాకారంలో ఉన్న పింక్ క్రిస్టల్స్ రెండింటిని.. మీ పిల్లల బెడ్ రూమ్‌లో ఉంచినట్లైతే... వారికి మంచి పెళ్ళి సంబంధాలు కుదరడం జరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

6:02 AM

ఇతరులను దూషించకండి.

ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇతరులను దూషించడం మంచిది కాదు. కోపం, విచారం, ఈర్ష్య, ద్వేషం లాంటివి ఫెంగ్‌షుయ్ ప్రకారం ఉండకూడదని నిపుణులు అంటున్నారు. కొంతమందికి ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్వభావం ఉంటుంది. అలాగే ఇంకొంత మందికి ఎదుటివారిని గురించి ఫిర్యాదు చేసే స్వభావముంటుంది. మరికొందరైతే ఇతరులను సులభంగా నిందించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. ఇతరులు పైకి ఎదుగుతుంటే విచారంలో కుళ్ళిపోయేవాళ్ళూ చాలా మంది ఉంటారు. ఇలాంటి వ్యతిరేక భావాలను దూరంగా ఉంచడం మంచిదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఈ భావాలు మనలో ఉంటే, అవి ఇంటి నిండా ప్రతికూల శక్తిని సృష్టిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.ఎక్కడ మనం సంతోషంగా, హృదయ నిర్మలంగా ఉంటామో.. అన్ని అనుకూలంగా సాగుతాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మన హృదయాలు స్వచ్ఛంగా ఉంటే అక్కడ "చీ" శక్తి సైతం ఎంచక్కా ఇంటి నిండా తిరుగుతుంది. ఈ "చీ" ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేని పక్షంలో ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అందుకే మీ పిల్లల మీద, శ్రీమతి లేదా శ్రీవారి మీద అకారణంగా అరవకండి. ఆగ్రహాన్ని తగ్గించుకుని వీలైనంతవరకు మృదువుగా మాట్లాడడం చేస్తే "చీ" శక్తి సకల సంతోషాలనిస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. అలా గాకుండా మీరు కోపంగా, ఆగ్రహంతో ఉంటే ఇంట్లో చెడ్డ చీ శక్తి తిరుగుతూ, సమస్యలకు నిలయమవుతుందని వారు పేర్కొంటున్నారు.

6:00 AM

ఫ్యాషన్ అంటూ చిరిగిన దుస్తులు వేసుకోకండి

ఆధునిక కాలంలో చాలామంది యువతీ యువకులు ఫ్యాషన్ పేరిట రంధ్రాలు ఉంచిన చొక్కా, ప్యాంట్‌లను ధరిస్తున్నారు. ఇలాంటి రంధ్రాలు పడిన దుస్తులు వేసుకోవడం అంతమంచిది కాదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. రంధ్రాలు గల దుస్తులు, చిరిగిన వస్త్రాలు దారిద్ర్యానికి చిహ్నాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇలాంటి రంధ్రాలు గల, అక్కడక్కడా చిరుగులున్న దుస్తులను వీలైనంతవరకు ధరించవద్దని ఫెంగ్‌షుయ్ అంటోంది. ఇంకా మీరు ఆఫీసు నుంచి రాగానే వేసుకున్న బట్టలు తీసేసి వేరే దుస్తులు ధరించండి. ఎప్పుడూ చూసినా కడిగిన ముత్యంలా కనిపించే వారి ఇంటికే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని పండితులు అంటున్నారు. అందుచేత ముఖాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. అదేవిధంగా రాత్రి వేళల్లో బట్టలు ఉతికి, బయట ఆరవేయడం మంచిది కాదు. అలా రాత్రి వేళ ఉతికి ఆరేసిన బట్టలు అతీత శక్తులను ఆకర్షిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.గాలి, వెలుతురు, నీరు ఎంత ముఖ్యమో ఇంటి శుభ్రత కూడా అంతే ముఖ్యమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అందుకే ఇంట్లో పనికి రాని వస్తువుల్ని అప్పటికప్పుడు తీసి బయట పారేయాలని, ఇంటిని అప్పటికప్పడు శుభ్రం చేస్తూ ఉండాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.