6:00 AM

ఫ్యాషన్ అంటూ చిరిగిన దుస్తులు వేసుకోకండి

ఆధునిక కాలంలో చాలామంది యువతీ యువకులు ఫ్యాషన్ పేరిట రంధ్రాలు ఉంచిన చొక్కా, ప్యాంట్‌లను ధరిస్తున్నారు. ఇలాంటి రంధ్రాలు పడిన దుస్తులు వేసుకోవడం అంతమంచిది కాదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. రంధ్రాలు గల దుస్తులు, చిరిగిన వస్త్రాలు దారిద్ర్యానికి చిహ్నాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇలాంటి రంధ్రాలు గల, అక్కడక్కడా చిరుగులున్న దుస్తులను వీలైనంతవరకు ధరించవద్దని ఫెంగ్‌షుయ్ అంటోంది. ఇంకా మీరు ఆఫీసు నుంచి రాగానే వేసుకున్న బట్టలు తీసేసి వేరే దుస్తులు ధరించండి. ఎప్పుడూ చూసినా కడిగిన ముత్యంలా కనిపించే వారి ఇంటికే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని పండితులు అంటున్నారు. అందుచేత ముఖాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. అదేవిధంగా రాత్రి వేళల్లో బట్టలు ఉతికి, బయట ఆరవేయడం మంచిది కాదు. అలా రాత్రి వేళ ఉతికి ఆరేసిన బట్టలు అతీత శక్తులను ఆకర్షిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.గాలి, వెలుతురు, నీరు ఎంత ముఖ్యమో ఇంటి శుభ్రత కూడా అంతే ముఖ్యమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అందుకే ఇంట్లో పనికి రాని వస్తువుల్ని అప్పటికప్పుడు తీసి బయట పారేయాలని, ఇంటిని అప్పటికప్పడు శుభ్రం చేస్తూ ఉండాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

0 comments:

Post a Comment