2:33 AM

హితుడా.. స్నేహితుడా.. స్వాప్నికుడా..!

నువ్వెప్పుడూ నా నేస్తానివే
అవును...
కొన్నిసార్లు నీతో పిచ్చిగా ప్రవర్తిస్తుంటా
నువ్వు కూడా అంతేలే...

ఎందుకలా అవుతోందో
కొన్నిసార్లు అర్థమైనట్లే ఉంటుంది
కానీ...
చాలాసార్లు అసలు అర్థమేకాదు

అయినా ఒకటి మాత్రం నిజం
ముందుగా నేనే నిన్ను క్షమించేస్తుంటా..
ఎందుకంటే....
నేనూ, నువ్వూ వేరు కాదు కదా..!

నువ్వు లేని రోజుల్లో...
పోనీలే పాపం అంటూ
ఒంటరితనంపై జాలిపడి
స్నేహం చేశాను గానీ
నీతో ఉన్నంత హాయి లేదు నేస్తం...!

మనవి రెండు శరీరాలేగానీ,
ప్రాణం మాత్రం ఒక్కటేనని
అన్నానే అనుకో...
అయితే మాత్రం,
నువ్వలా వెళ్తూ, వెళ్తూ
నా ఉనికిని కూడా తీసుకెళ్లటం
భావ్యమా చెప్పు...?!

నన్ను నేనే గుర్తుపట్టలేని స్థితిలో
ఎన్నాళ్లని ఉంటాను నేస్తం...?
అందుకే...
నేనూ నీ దగ్గరికే వచ్చేస్తున్నా....!!

0 comments:

Post a Comment