మనం ఎవరితో మాట్లాడినా మాట్లాడే తీరు ముఖ్యం. మాట్లేడే తీరులో సభ్యత, సంస్కారం బయటపడతాయి. వ్యక్తిత్వం వెల్లడవుతుంది. అందుకే నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందని పెద్దలంటారు. మాటలతో అందరి ప్రశంసలు పొందాలంటే కొన్ని సూచనలు పాటించాలి.
సంభాషణను మొట్టమొదట చమత్కారంగా ప్రారంభిచడానికి తగిన ప్రావిణ్యత, నైపుణ్యం సంపాదించాలి.
సంభాషణ ప్రారంభించిన తర్వాత చిన్న చిన్న వ్యాఖ్యానాలతో హాస్య ధోరణిలో సంభాషణ కొనసాగిస్తూ ఉండాలి. దానివల్ల వ్యక్తిగత ప్రమేయం లేకుండా సంభాషణ సాఫీగా సాగిపోతుంది.
ఆత్మీయులతో మాట్లాడినా, అపరిచితులతో మాట్లాడినా ఎదుటివాళ్ళ ముఖాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ వుండాలి. ఇందువల్ల మనం చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనించగలుగుతాం.
వింటున్నారనుకుంటే మనం సంభాషణ సాగించాలి. లేదా ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి విషయాన్ని మార్చాలి.
బిగ్గరగా నోటితో పెదవులు కలుపుతూ నిర్భయంగా మాట్లాడాలి. భయపడుతూ మెల్లిగా మాట్లాడితే అర్థం కాదు.
అస్పష్టంగా వుండే మాటలు ఎప్పుడూ వాడకూడదు.
అలాగే నిరాటంకంగా మాట్లాడకూడదు.
ఎదుటివాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేకపోతే సంభాషణ విసుగెత్తి పోతుంది. ఎక్కువమంది మన చుట్టూ వుంటే సాధ్యమైనంత వరకు అందరికీ పరిచయమైన విషయాలు అర్థమయ్యే విషయాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.
తల్లిదండ్రులతో, గురువులతో, పెద్దలతో సంభాషించే తీరు వేరుగా వుండాలి.
సమ వయస్సు గల వారితో మాట్లాడే సంభాషణ తీరు వేరుగా వుండాలి.
మాట్లాడేటప్పుడు మన ఆరోగ్యం, మన కష్టాలు, మన తాపత్రయాలు, ఇంటి గొడవలు వంటి వ్యక్తిగత విషయాలు ఏకరువు పెట్టకూడదు.
మన గురించే, మన అనుభవాలనే ఏకరువు పెడుతుంటే సంభాషణ రక్తికట్టదు.
కాదనడం, అపనమ్మకం, ఎత్తిపొడుపు మాటలు, ఆపేక్షణ వంటివి సంభాషణ చెడిపోవడానికి దారితీస్తాయి.
సంభాషణ అనేది ఎదుటి వారు మనకు మిత్రులుగా మిగిలిపోవడానికో, శత్రువులుగా విడిపోవడానికో దారితీస్తుందని గుర్తుంచుకోవాలి.
ఏమి మాట్లాడుతున్నామో తూచి తూచి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ సంతోషకరమైన విషయాలు మాట్లాడుకోవాలి.
నిస్పృహ ధ్వనించే మాటలు నాలుక చివరికి వస్తే దానిని ఆపుకొని సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిచాలి. ఇందువల్ల సాటివారికి మరింత ఇష్టులవుతాము.
ఆ వ్యక్తితో ఇతర విషయాలతో పాటు సినిమా విషయాలు చెపితే మనం చెప్పే విషయాలు జాగ్రత్తగా వింటాడు. మనకు చేరువవుతాడు.
సంభాషణా చాతుర్యం అనేది నలుగురి చేత ఆనందిపజేయగల విందులాంటిది.
మాట్లేడేటప్పుడు సంతోషం, ఆశ్చర్యం కలిగించే కొత్త కొత్త విషయాలు కూడా సంధర్భానుసారంగా ప్రస్తావిస్తే సంభాషణ రక్తికడుతుంది.
మాటలలో సామరస్యం, హాస్యం, చాతుర్యం, జోడిస్తే సంభాషణ మరీ మరీ రాణిస్తుంది. మంచి సంభాషణకు గుర్తు, సంభాషణ ప్రారంభానికి ముందు సమావేశమై వ్యక్తులు ఏ ఉత్సాహంతో వున్నారో, సంభాషణ అనతరం కూడా అలాగే వీడ్కోలు చెప్పుకోగలగడమే. అందరితోనూ చక్కగా సంభాషించగలిగే వారు ఆత్మీయులుగా పేరు తెచ్చుకొనవచ్చు. సుమధుర భాషణమే సంభాషణ లక్ష్యం.
3:04 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment