2:35 AM

ఈ జీవితం అంతా ఒక నాటకం . ఇందుకు సూత్ర దారి

*ఈ జీవితం అంతా ఒక నాటకం . ఇందుకు సూత్ర దారి భగవంతుడని రొటీన్ గా చెబుతాననుకుంటే పప్పులో కాలేస్తారు.ఈ నాటకం యొక్క స్క్రిప్టును ఓకే చేసింది సాక్షాత్ మీరే !

ఇందులోని ద్రుశ్యాలు కూడ విచిత్రమైనవే. ఏ నిమిషానికి ఆ నిమిషం గత నిమిషపు చర్యలతో మీరే డిసైడ్ చేస్తారు.మీకు బొత్తిగా అర్థంకాలేదుగా..కాస్త వివరంగానే చెబుతా.

గత జన్మలో పుట్టారు..గిట్టారు.మాయా భూయిష్థమైన ఈ శరీరాన్ని త్యజించారు. ఆత్మ స్వరూపంలో ఉంటూ సదరు జన్మలో మీ చర్యలను మీకు మీరే ఆడిట్ చేసారు.

నేనెందుకు ఈ భూమి పైకొచ్చాను? గతజన్మ ఖర్మలను కరిగించుకోవటానికి..భవ భంధాలలోనుండి విముక్తి పొందాలని.భగవంతుడ్నే నిరంతరం స్మరించాలని వచ్చాను . మరి నేను చేసిందేమి?

అందమైన భార్య, చేతినిండా డబ్బులు,ప్రయోజకులైన పిల్లలు,కీర్తి ప్రతిష్ఠల మాయలో పడి భగవంతుడ్ని మరిచాను.మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ జన్మలో ఏవైతే నా ముక్తికి ఆడ్డంకిగా ఉన్నవో అవి లేని జీవితాన్ని కోరాలి. అంటూ దిసైడ్ చేసారు
మీ సంకల్పానికనుగుణంగా దానికి తగిన తల్లి కడుపున ప్రవేశించారు.

ఈ ప్రతిపాదన చేసిన క్షణాన మీ ద్యేయం ముక్తి. ఇక పుట్తారు ,పెరిగారు. ఇప్పుడెమో మీ జీవితం పట్ల తీవ్ర అసంత్రుప్తికి గురవుతారు. ఇప్పుడు మీ ద్యేయం ప్రాపంచికం. మరి మిమ్మల్ని మళ్ళి మళ్ళి పుట్టించే శక్తియొక్క ఉద్దేశం ఏమి? లీల..జస్ట్ లీల మాత్రమే

*మీరు ఈ ప్రపంచం మీద లేని యుగమే లేదు. ఏదో రూపంలో ఏదో ప్రాంతంలో ఉంటూనే ఉన్నారు. మళ్ళి మళ్ళి పుడ్తునే ఉన్నారు.

*పరమపద సోపానంలో ఒక్కో గట్టంలో ఒక్కో పాము నోట పడినట్లే ఒక్కో జన్మలో ఒక్కో కారణంచేత ముక్తికేసి సాగే ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. (కాని జన్మ చక్రంలో ఆత్మ అధోముఖమయ్యే ప్రసక్తి లేదన్నది ఓదార్పు)

*గత జన్మలో ఏ కారణం చేత మీ ఆథ్యాత్మికాభివ్రుద్ది కుంటుబడిందో ఈ జన్మలో దాని జోలికి కూడ పోరు. కాని బాల్యంలో కాని యవ్వనంలో కాని దాని చాయ ఒకసారొ అలా దర్శనవిమ్మడమో ఒక సారి అలా పాస్ అవ్వడమో జరుగుతుంది

*మీలో చాలామంది అనుకోవడం ఆథ్యాత్మికం వేరు.ప్రాపంచికం వేరనే.ఒకదానిలో విజయం సాధిస్తె మరోదానిలో పూర్తిగా ఓడిపోతామనే అపోహ చాలా మందిలో ఉంది. కాని ఇది పొరభాటు. ఆథ్యాత్మికత గలవాడు కేవలం ఆథ్యాత్మిక జీవితంలోనే కాదు ప్రాపంచిక జీవితంలో కూడ తప్పక విజయం సాధిస్తాడు.(రామక్రుష్ణ పరమహంసుని భాషలో చెబితే ఈ ప్రాపంచిక జీవితం అన్నది పెద్ద పాత్రలోని తేనె వంటిది. మీరు తేనెటీగ వంటివారు .ఇందులో దూకేస్తే రెక్కలు తేనెతో తడిచి మునిగి చచ్చి పోతారు.

అలాగే ఆథ్యాత్మికత లేని వాడు ప్రాపంచికంగాను చిత్తుగా ఓడిపోతాడు.(రెక్కలు నాని Etc)

*తల్లి తండ్రుల సంయోగ వేళ తండ్రి వీర్యంలోని కోట్ల జీవ కణాల్లో ఒక కణమే మనం. కోట్ల కణాలతో పోటి పడి తల్లి గర్భాశయంలోని అండాన్ని చేరటంతోనే ఇలా బ్రతికి ఉన్నాం. జీవన్మరణ పోరాటం అంటె అది ఒక్కటే. ఆ పోటిలో నెగ్గిన ప్రతి ఒక్కరం అర్హులమే. మన అర్హత మళ్ళి ఎవడో ఒక వెదవ/ఎవర్తో ఒక వెదవది మళ్ళి అంగీకరించాల్సిన అవసరం లేదు.

*కోరికలు అనేకం. ఆ కోరికలను నెరవేర్ద్చే వనరులు పరిమితం. ఇదే అన్ని చిక్కులకు కారణం. వనరులను సమకూర్చటం మొదలు పెడితే వేల జన్మలెత్తినా ఆ ప్రస్తానం ఆగదు. అందుకే ఆ కోరికలను రెండుగా విభజించాలి.శారీరికం. మానసికం. శారిరిక కోరికలు న్యాయమైనవి.ధర్మమైనవి. (తిండి,నీరు,శరీరాన్ని ఎండ,వాన,చలినుండి రక్షించే బట్టలు,ఉంటానికి ఒక గూడు,మరీ కొవ్వెక్కినప్పుడు మరో శరీరం) మానసిక కోరికలను అవి ధర్మసమ్మతమైనవా కాదా అని అంచనా వేసే అహంకార రాహిత్యం ,జ్నానం ఉంటె అవి కూడ పెద్దగా భాధించవు.
*ఏది మిమ్మల్ని మరింతగా ఆకర్షిస్తుందో అది మిమ్మల్ని ముంచనుందని అర్థం. దేనిని చూస్తేనే ఒళ్ళు మండుతుందో,ఏది జరిగితే మీరు అసల్ బతకలేరనిపిస్తుందో అదే మీ జీవిత పరమావధి.

*దేనినైనా పొంద కోరితే దానికి మార్గం దాని గురించి అస్సలు మరిచిపోవడమే

*ఏదైతే అప్రయత్నంగా జరుగుతుందో అదే మీ ముక్తికి మార్గం.

*డబ్బొస్తుందికదా అని కక్రుత్తి పడకండి .వచ్చేది డబ్బేకాదు డబ్బే కాదు దాంతోపాటు ఆ డబ్బు ఎవడిదో వాడి ఖర్మ కూడ వస్తుంది.

0 comments:

Post a Comment