2:50 AM

"శృంగారం"- "బూతు"

పర్ణశాలలో వచ్చిన నేటి చిత్ర నాయికల వేషధారణ గూర్చిన టపాపై వచ్చిన వ్యాఖ్యలు చదువుతుంటే "శృంగారం-బూతు" అంటూ వచ్చిన వాదన గూర్చి ఆలోచిస్తుంటే వచ్చిన భావాల అక్షర రూపమీ టపా. శృంగారం మరియు రిలేటెడ్ విషయాల మీద నిర్మోహమాటమైన చర్చ కాబట్టి ఇష్టమైన వాళ్ళే చదవండి.

"శృంగారం" "బూతు" అంటూ విడదీసే ఈ రెంటిలో నాకు తేడా అంతగా కనపడి చావదు ఎంత వెతికినా. ఇందులో నాకు కనిపించే తేడా అల్లా "క్లాసు-మాసు" అంటూ మనం కల్పించుకున్న కృత్రిమ తేడాలే.

సూటిగా చెప్పుకుంటే "శృంగారం" అనేది "శారీరిక కలయికకు" "మానసికం" అనే చీర కట్టి అలంకరణ చేసి చూసుకొనే ఒక కోమలమైన భావన. ఇంకా సూటిగా చెప్పాలంటే "It is like foreplay". కలయికకు సంబంధించినదే కాకపొతే సున్నితంగా, కోమలంగా వర్ణించటం...ఊహించటం..జరగటం. అంతే. నేను ఇక్కడ "ప్లేటోనిక్ లవ్" లేదా "అమలిన శృంగారం" లాటి పెద్ద పెద్ద విషయాలకు పోవట్లేదు ఎందుకంటే "శృంగారం" అనే దానికి అర్థం నేను పైన చెప్పినదే ఎక్కువ శాతం మంది అనుకుంటారు అని నా భావన.

ఇక్కడ ఇంకోటి చెప్పుకోవలసినది ఏమిటంటే "శృంగారం"కు కొంచం పెద్ద పీట వేస్తాము....ఉట్టి "కలయిక/సంభోగం" కంటే ....అయితే ఎందుకు అన్న విషయం ఆలోచించాలి...ఆలోచిస్తే అది కూడా "మాసు క్లాసు" తేడా లాగే అనిపిస్తుంది నాకు. శృంగారం అన్నది ఎక్కువగా మానసికమై ఉందని నిర్వచించటం వలన...పూర్తీ శారిరికాంశమైన సంభోగానికంటే దానికి ఎక్కువ స్థాయి కల్పించబడింది.....కాని నిజంగా ఆలోచిస్తే పైన చెప్పినట్టు అది ఒక రకమైన రిఫైన్డ్ ఎక్ష్ప్రెశన్ అఫ్ లవ్ మేకింగ్ ఆర రిఫైండ్ థాట్ అఫ్ లవ్ మేకింగ్ బట్ ఇట్ ఇస్ శ్యూర్లీ అబౌట్ లవ్ మేకింగ్(i.e in my opinion romance is nothing but an refined expression of love-making or refined thoughts of love-making but it is surely about love-making).

ఇక "బూతు"......దేన్ని బూతు అంటాము అంతే ఆ నిర్వచనం యొక్క లక్ష్మణ రేఖ కాలాన్ని బట్టి మారుతుంటుంది.....కొన్నేళ్ళ క్రితం సినిమాలలోనే కథా నాయిక బొడ్డు చూపిస్తే అది బూతు అనుకునే వారు...కాబట్టి అందరు చక్కగా పైన కట్టుకుని "బూతు" లేకుండా చూపేవారు...అదే నేటి కాలంలో "అందం లేదా ఆకర్షణ" అయిపొయింది...కాబట్టి బూతు అనేది లక్ష్మణ రేఖలతో నిర్వచించ కుండా ఇంకో దేనితోనో నిర్వచించాలి....అదీ ప్రయత్నిద్దాం.

ఆలోచిస్తే "బూతు" అనేది శారీరిక కలయికకు సంబంధించి సూటిగా మాటాడటం, చూపటం, చెప్పటం అనుకోవచ్చు...ఉదా ఈ టపాకు దారి తీసిన మహేష్, సుజాత గార్ల టపాలచర్చాంశమైన "కథా నాయికల కురచ బట్టలు"....మామూలుగా ఒక బిచ్చగత్తె చిరుగు బట్టలతో కనిపిస్తే ఇలాటి వేగతులూ, అసహ్యాలు, అవమాన భారాలు రావేమో....ఇక్కడ "సంభోగ వస్తువు" గా "కథానాయికల/నాయకుల వేషధారణ/కదలికలు/మాటలు/చేష్టలు"ఉన్నాయి కనుక "బూతు" అయ్యాయి. చిన్న చూపు చూడబడుతున్నాయి..ఎందుకంటే ఇక్కడ మానాసిక కాంపోనెంట్ లేదు కనక.....కోమలం, తెరచాటుదనం లేదు కనక..సూటిగా పచ్చిగా ఉంది కనుక. ఇంకా సూటిగా చెప్పుకోవాలంటే "మాస్" కనుక.

నాకు అర్థం కానిది ఒకటే......
శృంగారం ....బూతు...రెండు కూడా సంభోగ సూచక విషయాలే....

"ఒకటి నీటు...ఒకటి నీటు".
"ఒకటి క్లాసు..... ఒకటి మాసు"...
"ఒకటి మానసికంతో మిళితం ..ఇంకోటి పచ్చి శారీరికం".....
"ఒకటి కొందరు భావుకులు మాత్రమె అనుభవించే స్థితి" "ఇంకోటి అశేష జనావళి ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా స్ఫందించేది"

మరెందుకు ఒక దానికి పెద్ద పీట...ఇంకో దానికి చిన్న చూపు..తిరస్కారం?

సామాజిక ప్రభావం వలన అని కొందరు అంటారు.....పెరిగే వయస్కుల పై పడే ప్రభావం వలన ఇంకొందరు అంటారు.....

నిజంగా "శృంగారం" వలన ఈ ప్రభావాలు లేవా?

ఎందరు "మిల్స్ అండ్ బూన్స్ రొమాన్సెస్" లేదా "సపరివార వార పత్రికల"మధ్య పేజీల్లో ప్రచురితమైన "సెంటర్ సేన్సేషన్స్ " "సరసమైన కథలు" చదివి "సంభోగం" గురించి కలలూ ఊహలూ పెంచుకోరు?

ఎందరు "శృంగార నాయికల" గూర్చి, ప్రభందాలు, శృంగార కావ్యాలు చదివి తమ జీవితాలకన్వయించుకోరు?

వీటికి జవాబులు మనకు తెలీవు ఎందుకంటే వీటి మీద పరిశోధనలు జరగలేదు కనుక...కాని "ఉట్టి బూతు" అనే వాటి ప్రభావం మాత్రం బయట కనపడుతోంది కాబట్టి అది తప్పు అయిపోతుంది....

నా ప్రకారం శృంగారమయినా, బూతు అనేవి అయినా....ఎంత ప్రభావం చూపెడుతున్నాయి అనేది ఆ ఆ వ్యక్తుల వ్యక్తిత్వం పై కూడా ఆధారబడి ఉంటుంది. వ్యక్తిత్వం అనేది మనుషుల పుట్టుక, పెంపకం, చుట్టూ ఉన్న వాతావరణం మీద...... అంటే.....క్లుప్తంగా చెప్పాలంటే వారి "An accident called birth" మీద ఆధారపడి ఉంటుంది....

ఎందుకో నా మనసుకు,
ఒక వర్గం ప్రజలకు నచ్చే "సున్నిత, కోమల ,తెఱచాటు , మానసిక మిళితమైన సంభోగానికి" పెద్ద పీట వేయటం ..........
చాలా మందికి నచ్చేదానిని(వారు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా ఇది నిజం) చిన్న చూపు చూడటం లేదా స్తిగ్మటైస్ Stigmatise చేయటం సరి అయింది కాదు అనిపిస్తుంది.

0 comments:

Post a Comment