మానవుని జీవన గమనాన్ని ప్రకృతిలోని వివిధ అంశాలతో మిళితం చేస్తూ భవిష్యత్తును దేదీప్యమానంగా వెలుగు చూపేందుకు రూపోందించిన శాస్త్రమే ఫెంగ్ ష్యూ. మూడువేల సంవత్సరాల కిందట ఈ శాస్త్రం ఫ.సి పేరుతో చైనాలో వెలుగు చూసింది. తదనంతరం ఫెంగ్ ష్యూగా రూపాంతరం చెంది వాస్తు, అలంకరణ, జీవన విధానాలపై పెను మార్పులు తీసుకు వచ్చింది.ఫెంగ్ ష్యూ శాస్త్రం మానవుడి నిత్య జీవితానికి సూచించబడిన అంశాలు చాలావున్నాయి. ఈ శాస్త్రం ప్రకారం జీవితంలోని కీలక అంశాల్లో శక్తిని అంధించగలవని ప్రధానంగా చెపుతుంటారు. అలాగే వాస్తురీత్య ఎనిమిది మూలల్లో ఏ మూల ఎలా శుభం జరుగుతుందో ఇలా వివరించారు.
1. ఆగ్నేయం... సంపద, వృద్ది, చెక్క, ఆకుపచ్చరంగు.
2. దక్షిణం.... పేరు, ప్రతిష్టలు, అగ్ని, ఎరుపు రంగు.
3. నైరుతి... ప్రేమ, సంసారం, భూమి, పసుపు, మట్టి రంగు.
4. తూర్పు... ఆరోగ్యం, కుటుంబం, చెక్క, ఆకుపచ్చ రంగు.
5. పడమర... భావుకత, సంతానం, లోహం, తెలుపు, బూడిదరంగు, మెటాలిక్ రంగు.
6. ఈశాన్యం... జ్ఞానం, విద్య, భూమి, పసుపు, మట్టి రంగు.
7. ఉత్తరం... వృత్తి, నీరు, నీలం, నలుపు రంగు.
8. వాయవ్యం... యానం, పరోపకారం, లోహం, తెలుపు, బూడిద రంగు, మెటాలిక్ రంగు.
ఆధునిక కాలంలో చాలామంది యువతీ యువకులు ఫ్యాషన్ పేరిట రంధ్రాలు ఉంచిన చొక్కా, ప్యాంట్‌లను ధరిస్తున్నారు. ఇలాంటి రంధ్రాలు పడిన దుస్తులు వేసుకోవడం అంతమంచిది కాదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. రంధ్రాలు గల దుస్తులు, చిరిగిన వస్త్రాలు దారిద్ర్యానికి చిహ్నాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇలాంటి రంధ్రాలు గల, అక్కడక్కడా చిరుగులున్న దుస్తులను వీలైనంతవరకు ధరించవద్దని ఫెంగ్‌షుయ్ అంటోంది. ఇంకా మీరు ఆఫీసు నుంచి రాగానే వేసుకున్న బట్టలు తీసేసి వేరే దుస్తులు ధరించండి. ఎప్పుడూ చూసినా కడిగిన ముత్యంలా కనిపించే వారి ఇంటికే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని పండితులు అంటున్నారు. అందుచేత ముఖాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. అదేవిధంగా రాత్రి వేళల్లో బట్టలు ఉతికి, బయట ఆరవేయడం మంచిది కాదు. అలా రాత్రి వేళ ఉతికి ఆరేసిన బట్టలు అతీత శక్తులను ఆకర్షిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.గాలి, వెలుతురు, నీరు ఎంత ముఖ్యమో ఇంటి శుభ్రత కూడా అంతే ముఖ్యమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అందుకే ఇంట్లో పనికి రాని వస్తువుల్ని అప్పటికప్పుడు తీసి బయట పారేయాలని, ఇంటిని అప్పటికప్పడు శుభ్రం చేస్తూ ఉండాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.