On 7th August 2009, at 12hr 34 minutes and 56 secondsthe
12:34:56 07/08/09
1 2 3 4 5 6 7 8 9
This will never happen in your life again!
జ్యోతిష్యుల లెక్కల ప్రకారం శుక్రవారంనాడు ఓ విచిత్రం జరుగనుంది. ఒకేసారి తొమ్మిది సంఖ్యలు కలుస్తున్నాయి. అది 07-08-09 అంకెలతో కలిసి 01 నుంచి 09 అంకెల్లోకి మారిపోతుంది. ఇలా వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.
ఈ యోగం ఈసారి 7 ఆగస్టుతో రానుంది. 07 తారీఖు, 08వ నెల మరియు 09వ సంవత్సరం, ఈ అంకెలు మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల 56 సెకండ్లకు కలుస్తాయి. ఆ సమయంలో ఈ అంకెలు 01 నుంచి 09గా వరుసక్రమంలో మారుతాయి. ఈ క్షణాలు చాలా దుర్భరమైనవని సంఖ్యాశాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.
రాజయోగం పరిస్థితి :- క్రమసంఖ్య 7 చాల గొప్పదని భాగవత పండితులు పండిట్. ఉమేశ్ భాయీ జానీ చెపుతున్నారు. 1 నుంచి 9 వరకున్న సంఖ్యలను కలిపితే 45 వస్తుంది. వీటిని కలిపితే 9 అవుతుంది. మన శరీరంకూడా 9 ద్వారాలు కలిగినది. ఈ రోజు ఉదయం గం. 8.28లనుంచి సాయంత్రం గం.4.24ల వరకు రాజయోగం బ్రహ్మాండంగా ఉంది. ఈ సమయంలో చేసిన శుభకరమైన పనులకు ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఆయన సూచిస్తున్నారు.
శుభకార్యాలకు మహోన్నతమైనది :- 1 నుంచి 9 వరకుగల సంఖ్యల్లో నవగ్రహాలుంటాయంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్రజ్ఞులు సంజయ్ దుల్హానీ. సంఖ్యాశాస్త్రానన్నుసరించి ఇలాంటి సమయం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తుందని ఆయన తెలిపారు.
ఇలాంటి సమయంలో శుభకార్యాలు చేస్తే ఉత్తమమైన ఫలితాలుంటాయని ఆయన పేర్కొన్నారు. 9 సంఖ్యతో ఏ సంఖ్యను కలిపినా మూల్యాంకం అదే వస్తుంది. ఈ స్థితి కృష్ణపక్షంలో తిథి విదియ, తులా లగ్నం మరియు లగ్నోదయం స్వాతి నక్షత్రంలో ఈ కాలం వస్తుంది.
** ముఖ్యంగా 2, 3, 8 సంఖ్యాకులు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు జ్యోతిష్యులు.
** ఈ రోజు యాత్రలకు శుభసమయం
** దుర్ఘటనలనుండి జాగ్రత్తగా ఉండండి** ధనహాని కలిగే సూచనలున్నాయి, మాటలు ఆచితూచి మాట్లాడండి.
** నూతన కార్యాలను ప్రారంభించేవారికి మంచి ఫలితాలుంటాయి
** ఎవ్వరినీ విశ్వసించకండి
** నూతన కార్యాలను ప్రారంభించండి, ధనలాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.