ఒంటరిగా వెళుతున్న జీవితంలోకి
అనుకోకుండా నువ్వొచ్చావు
అన్నీ తెలుసనుకునే నాకు
అనుభూతులెన్నో చూపించావు
ఎదురుచూపంటె తెలియని నాకు
ఎన్ని జన్మలయినా ఎదురుచూసేలా చేశావు
సృష్టి నిండా స్నేహం ప్రేమ రెండే గొప్పవనుకున్నాను
వీటికన్నా గొప్పది మన అనుబంధం అని తెలుసుకున్నాను
ఇద్దరు మనుషులు కలసి ఉంటేనే బంధం అనుకున్నాను
మనస్సులు కలిస్తే కూడా బంధమవుతుందని తెలుసుకున్నా
దూరంలో ఉన్నావని బాధలో ఉన్నా
నా వెంటే ఉన్నావన్న ఆశతో బ్రతుకుతున్నా ...
4:50 AM
Subscribe to:
Posts (Atom)