నేనంటే నేనే! (My Take on Identity)
"బ్రాహ్మణుడిని నేను" నేను అని అనుకోటం తప్పా?
"బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" ని ఆడిపోసుకుంటే నాకెందుకు బాధ?
అసలు........
"నేను" అంటే ఏమిటి?
నా అస్థిత్వం ఏమిటి?
నేనంటే నా శరీరం
నేనంటే నా మనసు
నేనంటే నా సంస్కారం
నేనంటే నా ప్రవర్తన
నేనంటే నా ఆశయాలు
నేనంటే నా గతం
నేనంటే నా మతం
నేనంటే నా కులం
నేనంటే నా కుటుంబం
నేనంటే నా రాష్ట్రం
నేనంటే నా దేశం
నేనంటే ఇలాతలం
నేనంటే సౌరకుటుంబం
నేనంటే మానవతం
నేనంటే పురుషజం
నేనంటే కవిత్వం
నేనంటే భావుకత్వం
నేనంటే సున్నితం
నేనంటే భాద్యత
నేనంటే వ్రుత్తి
నేనంటే ప్రవృత్తి
నేనంటే సామాజికత
నేనొక కొడుకు
నేనొక అన్న
నేనొక భర్త
నేనొక భవితవ్యం
నేనొక ప్రస్తుతం
నేనొక జ్ఞాపకం
నేనొక గతం
నేనొక చరిత్రం
నేనొక పిపీలకం
అయినా ......
నేనొక పచ్చి నిజం!!!
అయితే....
నేనొకొక్కప్పుడు ఒకోటి
నేనొకోసారి అన్నీ
నేనింకోసారి కొన్నే
నేనేసారి ఒకోతో
నేనెందుకు అన్నీనో
నేనేపాటి కొన్నో
నేనే నిర్ణయం చేసేది
అంటే....
నేనంటే నిర్ణయం నాదే
నేనంటే నేనే
మరి........
నేనేంటో నాకు తెలిసినపుడు
నేనేంటో నేనే నిర్ణయించేప్పుడు
నేనంటే వేరెవరో చెప్పేదెందుకు?
నేనంటే వారెవరు తెలిపేందుకు?
అహం బ్రహ్మస్మి కాదయా
అహం అహంస్మి
నేనంటే నేనే!
2:44 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment